ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలు మూసివేసి గౌడ్స్ ను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాటి పాలకులు గౌడ కులస్తుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. నాటి పాలకులకు గౌడ్స్ రెగ్యులర్ గా మామూళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదన్నారు. గతంలో ఆబ్కారీ శాఖ వాళ్ళు ఎన్నో వేధింపులకు గురి చేశారని… ఇప్పుడు గౌడన్నలు ఎవరికి భయపడడం లేదన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో గౌడన్నలు పనులు చేసుకుంటున్నారని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గౌడ్సే కల్లు గీయాలి, వాళ్లే కల్లు అమ్మాలనే సర్వాయి పాపన్న డిమాండ్ ను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్ లను ప్రారంభించుకున్నామని తెలిపారు. గౌడ్స్ ను రాజకీయంగా అణిచివేతకు గురి చేశారని.. అందుకే చిన్న తాటి చెట్లను కనిపెట్ట లేదని అన్నారు.