రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది – కోమటిరెడ్డి

-

యాదాద్రి జిల్లా: గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహారంపై మరోసారి మాట్లాడడానికి నిరాకరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లలేదు.. ఆ వ్యవహారంపై తనకి సంబంధం లేదని అన్నారు. ఈటెల, రేవంత్ ఎపిసోడ్ పై నేను మాట్లాడేది ఏమీ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news