రోడ్డుపై స్కేటింగ్‌ చేస్తున్న భామ్మలు.. అసలు విషయం తెలిసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!

-

వృధ్యాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.. మోకాళ్ల నొప్పులు వచ్చేస్తాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే వారికి చాలా కష్టం. ఇంకా చాలా సమస్యలతో వృధ్యాప్యాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే ఈ భామ్మలు మాత్రం అలాకాదు.. ఏకంగా రోడ్డుపై స్కేటింగ్‌ చేస్తున్నారు. స్కేటింగ్‌ యువత చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున జారిపడ్డారంటే.. నడుములు విరిగిపోతాయి.. అలాంటిది ఆ బామ్మలు మాత్రం రోడ్డుపై రయ్‌ రయ్‌మని స్కేటింగ్‌ చేస్తున్నారు. ఇటీవల కొందరు వృద్ధ మహిళలు రోడ్డుపై స్కేటింగ్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. హాట్‌ కేక్‌లా ఈ మ్యాటర్‌ స్ప్రెడ్‌ అయిపోయింది. చూసిన వారంతా అందరికీ షేర్‌ చేసేశారు.. అయితే అసలు విషయం తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Ashish Jose (@tarqeeb)

స్కేటింగ్ చేస్తున్న ఫొటోల్లో ఉన్న వృద్ధులు అంతా 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ ఫోటోలు నిజం కాదట.. పాపం అందరూ నిజమే అనుకోని తెగ ఫీల్‌ అయ్యారు. అసలు మ్యాటర్‌ ఏంటంటే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేట్ చేసింది

ప్రస్తుతం ఈ ఫోటోలను ఆశిష్ జోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తార్కిబ్‌లో పోస్ట్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ చిత్రాలను రూపొందించినట్లు తెలియజేశారు. ఈ నిజం తెలిసిన వెంటనే యూజర్లు షాక్కు గురయ్యారు. చాలా మంది యూజర్లు ఈ ఫొటోలు నిజమని, తాము నిజంగా ఆశ్చర్యపోయామని కమెంట్‌లో పేర్కొన్నారు.

ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇందులో దేవుళ్ళ నుంచి ప్రపంచంలోని కొంతమంది ధనవంతుల వరకు ఏఐ ఫొటోలు వచ్చాయి. ప్రస్తుతం వృద్ధ మహిళలు స్కేట్‌బోర్డును ఆస్వాదిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడా కొంచెం కూడా డౌట్‌ రాకుండా ఈ ఫోటోలు భలే ఉన్నాయి కదా..! మీరు చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ashish Jose (@tarqeeb)

Read more RELATED
Recommended to you

Latest news