వ‌రి కొనుగోలుకు ప్ర‌భుత్వం సిద్ధం.. నేటి నుంచే శ్రీ‌కారం

-

తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి పండించిన వ‌రి ధాన్యాన్ని సీఎం కేసీఆర్.. త‌మ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. దీనికి నేటి నుంచే శ్రీ‌కారం చేయ‌నున్నారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ప‌లు గ్రామాల్లో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు, రేపు విడతల వారీగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.

కాగ ఈ యాసంగికి తెలంగాణ రాష్ట్రంలో 36 ల‌క్షల ఎక‌రాల్లో వ‌రి సాగు అయింద‌ని.. అందులో 60 నుంచి 65 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల వ‌రి ధాన్యం వ‌స్తుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంది. అలాగే ఇత‌ర రాష్ట్రాల నుంచి ధాన్యం.. తెలంగాణకు రాకుండా.. అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందు కోసం 51 పోలీస్ చెక్ పోస్టుల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. స్థానిక రైతుల వ‌రి ధాన్యాన్ని మాత్ర‌మే కొన‌గోలు చేస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆధార్ కార్డు ఆధారంగా కొనుగోలు చేసేలా.. రాష్ట్ర ప్ర‌భుత్వం సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news