రైతులకు గుడ్ న్యూస్.. రూ.2లక్షల రుణ మాఫీ పై ప్రభుత్వం కీలక ప్రకటన

-

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ఏప్రిల్ 07 వస్తే.. నాలుగు నెలలు పూర్తి అవుతుంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందని.. కొత్తగా 6 గ్యారడీలు చెబుతుందని కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

Telangana Govt
Telangana Govt

ఈ నేపథ్యంలో తాజాగా రైతు రుణమాఫీపై  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 2023-24 యాసంగీ పంటకు సంబంధించి రైతుబంధు నిధులను విడుదల చేశామని తెలిపారు. ఇప్పటివరకు 64,75,819 మంది రైతుబంధు నిధులను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 92.68 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రూ.2లక్షల రుణమాఫీపై విధి విధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఆర్బీఐ, బ్యాంకులతో కలిపి విధి, విధానాలను తయారు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి తుమ్మల.

Read more RELATED
Recommended to you

Latest news