స్కిల్ యూనివర్సిటీ కోర్సులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుండి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాలు ఖరారు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.  ఈ నిర్మాణ పనులు ముగిసేంత వరకు ఈ వర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ చైర్ పర్సన్ గా ఆనంద్ మహీంద్రాను, శ్రీనివాస సి రాజు ను కోచైర్మన్ గా నియమించడం జరిగిందని గుర్తుచేశారు. దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, తొలుత స్కూల్ ఆఫ్ ఈ- కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news