ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్… ఢిల్లీ పర్యటలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కేంద్రమంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ సమావేశం రద్దయింది. ఇవాళ రాత్రి 10.15 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ…. మణిపూర్ హింసపై అఖిలపక్షం భేటీ, తెలంగాణ బిజెపి నేతల సమావేశంతో అమిత్ బిజీగా ఉండటంతో చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది.
దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు మంత్రి కేటీఆర్ తిరుగు పయనం కానున్నారు. కాగా, మణిపూర్ హింస నుంచి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని BRS మాజీ MP వినోద్ కుమార్ తెలిపారు. మణిపూర్ హైకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. మెయితే జాతి ప్రజలను STల్లో చేర్చే హక్కు పార్లమెంట్ కే ఉంటుందన్నారు. రెండు తెగల మధ్య ఘర్షణతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగిన ప్రధాని మౌనం వహించడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశంలో అందరి సూచనలు స్వీకరించినట్లు చెప్పారు.