తెలుగు రాష్ట్రాల ముస్లింలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌ శుభా కాంక్షలు చెప్పారు. మొహర్రం పండుగ నేపథ్యంలో.. ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! అని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం! అంటూ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

ఇక అటు త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం అన్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధ‌పడిన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త మ‌న‌వ‌డు ఇమామ్ హుస్సేన్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శం. పవిత్ర‌మైన ఈ మొహ‌ర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మ‌త స‌మైక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయని చెప్పారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.