నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఇవాళ గ్రూప్‌-1 నోటిఫికేషన్ రిలీజ్ !

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. నేడో, రేపో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేయనుంది. 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి గత కొన్నాళ్లుగా కసరత్తు జరుగుతోంది. గ్రూప్ సహా అన్ని ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేసిన నేపథ్యంలో పరీక్షా విధానానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది.

కమిషన్ ప్రతిపాదనల మేరకు వాటన్నిటిని సవరిస్తూ పరీక్ష విధానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం వైపు నుంచి టిఎస్పిఎస్సి కి రావాల్సిన వివరాలు అలాగే సమాచారం దాదాపు అందాయి. ఒకటి లేదా రెండు శాఖల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని అది కూడా మధ్యాహ్నం లోపు కమిషన్ కు చేరుతుందని చెబుతున్న అధికారులు. ఆ సమాచారం రాగానే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందోనని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. కాగా నిన్న తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news