సొంతిళ్లూ లేని వారికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. జూలై నుంచి గృహ లక్ష్మి పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇంటి నిర్మాణం కోసం స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయలు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, జూన్ 24 నుండి పోడు భూములు పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
పోడు భూములకు కూడా రైతు బంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం జూన్ 24 నుంచి 30 వరకూ నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. కొత్తగా పోడు పట్టాలు పొందిన వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి, పోడు పట్టాల యాజమానులకు నేరుగా రైతుబంధును జమచేస్తుందని చెప్పారు. నూతనంగా పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు అందజేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.