చేనేత ఉత్పత్తులపై జిఎస్టిని వెంటనే ఎత్తివేయాలి – కేటీఆర్

-

కేంద్రం జీఎస్టీ విధించడం చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనని అన్నారు చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తుల మీద ఉన్న జీఎస్టీని కేంద్రం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని.. తెలంగాణ చేనేత కళా నైపుణ్యాలకు ప్రతీకలని అన్నారు.” మన చేనేత కార్మికుల శ్రమను గుర్తించండి.. చేనేతను కళాకారుల నైపుణ్యాలను గుర్తించండి. చేనేత వస్త్రాలను కొనండి… చేనేతను ఆదరించండి.” అన్నారు మంత్రి కేటీఆర్.

అంతరించిపోతున్న చేనేత కళలను ఆధునికీకరణ చేసి ప్రజలకు అందుబాటులో పెడుతున్నారని.. దేశం గర్వించదగ్గ చేనేత వస్త్రాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమన్నారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీ ద్వారా ముడి సరుకు అందిస్తున్నామన్నారు కేటీఆర్. 96 కోట్లు క్రిప్ట్ పథకం ద్వారా లక్షలాది మంది కార్మికులకు కరోన సమయంలో సహాయం చేసామన్నారు.

నేతన్నకు భీమా ద్వారా 80 వేల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు ప్రమాదవశాత్తు నేత కార్మికుడు చనిపోతే పది రోజుల్లో 5 లక్షల భీమా నామినికి అందిస్తామన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేత కార్మికులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు మంత్రి. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల శరీర సౌందర్యం పెరగడంతో పాటు దేహానికి మంచి కలుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news