గుడ్​న్యూస్.. తెలంగాణలో సెప్టెంబరులోగా ‘గురుకుల’ పరీక్షలు

-

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించింది. గురుకుల పోస్టుల కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూలును త్వరలో ప్రకటించనుంది. సెప్టెంబరులోగా పరీక్షలు పూర్తి చేయాలని గురుకుల నియామక బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల తేదీలకు అడ్డంకులు లేకుండా ఖరారు చేయనుంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టులకు దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మిగతా పోస్టులకు తక్కువగా వచ్చాయి. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. ఆయా పోస్టులకు ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news