ప్రధానిని తిట్టిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తప్పవు -జివిఎల్

-

ప్రధానిని తిట్టిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహా రావు. మంత్రి కేటీఆర్ ప్రదానిపై హద్దు మీరి మాట్లాడారు..ప్రధాని ని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిజెపిపై ఉన్న భయాన్ని తెలియజేసే వాఖ్యలు కేటీఆర్ చేస్తున్నారు.. తమ చానల్స్, పేపర్లలో తప్పుడు రాతలు రాస్తున్నారని అగ్రహించారు. కేంద్రాన్ని, నరేంద్రమోడీని, బిజెపిని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడం..కేటీఆర్ తండ్రి కేంద్ర క్యాబినెట్ లో ఉన్నప్పటి కంటే ఎక్కువ రేట్లు ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు.

కేసీఆర్ కేంద్ర క్యాబినెట్ లో ఉన్నపుడు, తెలంగాణ గుర్తు లేదా ? అని నిలదీశారు. ఏపీలో కేంద్ర వాటాకింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వాళ్ళ స్టిక్కర్లు పెడుతున్నారు.. జగనన్న గృహాలు అని చెప్పుకుంటున్నారు..కేంద్ర నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు… ప్రధాని ఉచితం గా బియ్యం ఇస్తున్నారన్నారు. సబ్సిడీ కింద ఇస్తున్న బియ్యం పథకానికి మీ ఫోటోలు ఎలా పెడతారు. జగన్ సమాదానం చెప్పాలని.. టీఆరెస్ లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version