BREAKING : తెలంగాణలో నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటు జోడో యాత్ర కొనసాగింది. ఇక తెలంగాణలో భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది.

ఈ తరుణంలోనే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. ఇక బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ.. పలు సంచలన ప్రకటనలు చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. అక్టోబర్‌ 23న తెలంగాణ రాష్ట్రంలోకి భారత్‌ జోడో యాత్ర.. ఎంటర్‌ అయిన సంగతి తెలిసిందే.