తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

-

ముందస్తు ఎన్నికల ప్రచారంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ పార్టీకి లేదని, తాము కానీ, తమ పార్టీ అధినేత కూడా ఎక్కడ చెప్పలేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి అసలు లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామనేది బిజెపి జ్యోతిష్యులు చెప్పే మాట అని, కొంతమంది బిజెపి నేతలు జ్యోతిష్యులుగా మారి అప్పుడప్పుడు ముందస్తు ఎన్నికలపై జోస్యం చెబుతుంటారని హరీష్ రావు సెటైర్లు పేల్చారు.

తాము జైలుకు వెళ్తామని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కొంతమంది బిజెపి నేతలు జ్యోతిష్యం చెబుతూ ఉంటారని హరీష్ రావు విమర్శించారు. మునుగోడులో టిఆర్ఎస్ కు మెజార్టీ తగ్గడాన్ని చూసి బిజెపి బలపడిందని అనుకుంటే పొరపాటు అని, బిజెపి నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే, రెండు ఉప ఎన్నికల్లో బిజెపి డిపాజిట్లు కోల్పోయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news