బిజెపి హటావో సింగరేణి బచావో పేరుతో పోరాటం చేయాలి – హరీష్ రావు

-

బిజెపి హటావో సింగరేణి భచావో పేరుతో పోరాటం చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 14 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ పోవాలంటే బిజెపి పోవాలన్నారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేస్తున్నారని.. ఇది అన్యాయం అని మండిపడ్డారు. పార్లమెంటులో చెప్పిన మాటలు నమ్మాలా.. రామగుండం గల్లీలో మాటలు నమ్మాలా అని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం బిఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు.

సీఎం కేసీఆర్ వల్ల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. రామగుండంలో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని తెలియజేశారు. కార్మికుల పిల్లలు కార్మికులు కాకూడదని.. డాక్టర్లు కావాలని అన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి, ఆర్టీసీని కాపాడుతూ ఉద్యోగాల కల్పన చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news