సంగారెడ్డి ప్రభుత్వ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఎందుకు ESI హాస్పిటల్ లో డెలివరీలు చేయట్లేదని ఈ సందర్భంగా డాక్టర్లను ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. ముగ్గురు డాక్టర్లు కలిసి జులై నెలలో 3 డెలివరీలు చేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.
మీకు ఇక్కడ పనిలేకుంటే పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ చేయండి అని చెప్పిన మంత్రి.. ESI హాస్పిటల్ లో నాలుగు ఏండ్లుగా డ్యూటీకి రాని 4 డాక్టర్ల పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు.
డ్యూటీకి రాకుండా నాలుగు సంవత్సరాలు అయిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు.
హాస్పిటల్ లో డాక్టర్లు ఫుల్ పేషేంట్స్ నిల్ అంటూ కౌంటర్ వేసిన మంత్రి.. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయడం లేదని చెప్పారు. మీ సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్ అయినప్పుడు ఎందుకు వైద్య పరికరాలు తీసుకోలేదని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. డాక్టర్లకు దండం పెట్టి దయచేసి పని చేయండని చెప్పారు. మీ వృత్తికి న్యాయం చేయాలని కోరారు మంత్రి హరీష్ రావు