కేసీఆర్ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల మనమే గెలిచాం. స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయారు… కాంగ్రెస్ బడ్జెట్ లేకపోయినా అబద్ధాలు ప్రచారం చేసి గెలిచింది. హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగారెంటీలో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్లు ఆడపడుచులు ఉన్నారని అందరికీ నెలకి 2500 ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అని అడిగారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలానికి వంద రోజులు పూర్తి అవుతాయి అన్నారు. రైతుబంధు 15 వేలు, ఉచిత కరెంట్, 2 లక్షల రైతు రుణమాఫీ, పింఛన్ 4 వేలు, వడ్లకు బోనస్, అక్కచెల్లెళ్లకు 2500 హామీల్లో ఏదీ అమలు కాలేదని చెప్పారు.పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చురకలు అంటించారు.