కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా సర్కులర్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడుతూ ఈ లేఖ విడుదల చేశారు.”కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఉపాధిని దెబ్బతీసింది.

ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపయోగకారిగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం పేదల నోట్లో మట్టి కొట్టడమే. తెలంగాణ అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మీ నాయకత్వం, దేశంలోని కూలీలతో పాటు, తెలంగాణలో ఉన్న 57.46 లక్షల జాబ్ కార్డు కలిగిన 1,21,33,000 మంది ఉపాధి హామీ కూలీల హక్కులను కాల రాస్తుంది. దేశంలోని నిరుపేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న పథకం ఉపాధి హామీ పథకం.

అలాంటి పథకాన్ని రద్దు చేసే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో తనిఖీలు ప్రారంభించింది. ఒక్కని చంపడానికి పిచ్చికుక్క అని ముద్ర వేసినట్లు పేదల పాలిట కల్పతరువైన ఉపాధి హామీ పథకం పై అవినీతి ముద్ర వేసి రద్దు చేసే కుట్ర సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని”లేఖ లో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news