హరీశ్ రావు దెబ్బకు దిగివచ్చిన రేవంత్ ప్రభుత్వం !

-

తెలంగాణలోని  మల్లన్న సాగర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీళ్లు విడుదల చేశారు. తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు గారు డెడ్ లైన్ పెట్టిన గంటన్నర లోనే కూడ వెళ్లి వాగులో కి నీల్లోచ్చాయి.హరీష్ రావు దెబ్బకు  కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది.  24 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించింది.

ఇవాళ  మల్లన్న సాగర్ నుంచి కూడవెళ్లికి 800 క్యూసెక్కుల నీటి విడుదల చేసింది. కేవలం  24 గంటల్లో నీళ్లు విడుదల చేయకుంటే గేట్లు మేమే ఎత్తుతామని ఉదయం హెచ్చరించారు హరీష్ రావు. ప్రభుత్వం పరువు పోతుందని భావించి ముందస్తు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రైతు సోదరులు మాజీ మంత్రి హరీశ్ రావుకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు రైతుల కోసమే నీటిని వదిలినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news