కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు ప్రతిపక్షాలకు మాస్టర్ స్టోక్ వచ్చింది – హరీష్ రావు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు ప్రతిపక్షాలకు మాస్టర్ స్టోక్ వచ్చిందని చురకలు అంటించారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ లాబీలో మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆర్టీసీ, రుణమాఫీ, పొడుభూములు, విఆర్ఏ నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు మాస్టర్ స్టోక్ వచ్చిందంటూ ఎద్దేవా చేశారు హరీష్‌ రావు.

దెబ్బల మీద దెబ్బ కొట్టడం వల్ల విపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఎమ్ మాట్లాడాలో తెలియడం లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రతిపక్షాల వాయిస్ డౌన్ అయిందని ఎద్దేవా చేశారు. వరుస నిర్ణయాల వల్ల విపక్షాలకు వాయిస్ లేకుండా పోయిందని.. బయటే కాదు- అసెంబ్లీ లోపల కూడా విపక్షాలను కడిగేస్తామని హెచ్చరించారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news