LIC Jeevan Kiran : ఈ టర్మ్‌ ప్లాన్‌లో ప్రీమియం డబ్బులు మొత్తం ఇచ్చేస్తారట..!

-

LIC Jeevan Kiran : పోస్ట్‌ఆఫీస్‌లో, ఎల్‌ఐసీలో ఎన్నో స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వృధాగా పోయే మీ డబ్బును ఇందులో పెడితే మీకు తెలియకుండానే కొన్నాళ్లకు అవి లక్షలు అవుతాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ వడ్డీ వచ్చే ప్లాన్‌ చాలా ఉంటాయి. కానీ చాలా తక్కువ మందికే వీటి గురించి అవగాహన ఉంటుంది. ఎల్‌ఐసీ జీవన్ కిరణ్‌ పేరిట కొత్త టర్మ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. మెచ్యూరిటీ అనంతరం ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఈరోజు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LIC

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కొత్త టర్మ్‌ పాలసీని లాంచ్‌ చేసింది. జీవన్‌ కిరణ్‌ (ప్లాన్‌ 870) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఇండివిడ్యువల్‌ సేవింగ్స్‌ అండ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్‌. మెచ్యూరిటీ పూర్తయ్యాక ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ సమయంలో ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. సాధారణంగా టర్మ్‌ పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం జరగదు. ఈ ప్లాన్‌లో మాత్రం పాలసీ సమయంలో బీమా హామీ ఇవ్వడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో ప్రీమియం సొమ్మును వాపస్‌ చేస్తారు.

అర్హత

జీవన్‌ కిరణ్ ప్లాన్‌ కొనుగోలుకు కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించారు.
మెచ్యూరిటీకి కనీస వయసు 28 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 80 ఏళ్లు ఉంటుంది.
10 ఏళ్లు నుంచి 40 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది.
కనీసం 15 లక్షల బీమా హామీతో ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు.
గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితీ లేదు. కనీస ప్రీమియం మొత్తం రూ.3 వేలు కాగా.. సింగిల్ ప్రీమియం అయితే రూ.30 వేలుగా నిర్ణయించారు.
ఏడాదికి ఒకసారి లేదా ఆరు నెలలకోసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించొచ్చు.

ప్రయోజనాలు

జీవన్‌ కిరణ్‌ టర్మ్‌ బీమా ప్లాన్‌లో పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ అనంతరం ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
అధిక ప్రీమియంలు, రైడర్లకు చెల్లించిన మొత్తాలు, పన్నులను ఇందులోంచి మినహాయిస్తారు.
రెగ్యులర్‌తో పాటు సింగిల్‌ ప్రీమియంకూ ఇదే నియమం వర్తిస్తుంది.
మెచ్యూరిటీ తేదీ తర్వాత బీమా కవరేజీ రద్దవుతుంది.
ఒకవేళ పాలసీ టర్మ్‌ ప్రారంభమయ్యాక కవరేజీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
ఈ మొత్తాన్ని ఏకమొత్తంతో లేదా ఐదేళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తారు.

ఇతర వివరాలు

జీవన్‌ కిరణ్‌ ప్లాన్‌ తీసుకోవడానికి గృహిణులు, గర్భిణులను మినహాయించారు. డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత మాత్రమే స్త్రీలు ఈ ప్లాన్‌ తీసుకోవచ్చు. కొవిడ్‌కు సంబంధించిన వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకోకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ధూమపానం అలవాటు ఉన్న వారికి, లేని వారికి ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుందట. ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ పాలసీని ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా కొనుగోలు చేయొచ్చు లేదా ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ప్లాన్‌తో పాటు కావాలంటే యాక్సిడెంటల్‌ డెత్‌ అండ్‌ డిజెబిలిటీ బెన్‌ఫిట్‌ రైడర్లను కొనుగోలు చేయొచ్చు. పాలసీపై ఎలాంటి లోన్‌ సదుపాయం లభించదు.

Read more RELATED
Recommended to you

Latest news