విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను మోసం చేశాడు – కిషన్ రెడ్డి

-

తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కెసిఆర్ మోసం చేశాడని మండిపడ్డారు కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమోచన దినోత్సవం జరపాలని గతంలో కాంగ్రెస్ ను నిలదీసిన కేసిఆర్.. నేడు ఎందుకు విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు.

దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఅర్ఎస్ ప్రయత్నం చేస్తున్నయని ఆరోపించారు. అదే రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసారని మండిపడ్డారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. సెప్టెంబరు 17న సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయనన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు కిషన్ రెడ్డి. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు.

మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ సెప్టెంబర్ 17 నే ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు మజ్లిస్ తో కుమ్మకై విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. గత ఏడాది కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా కెసిఆర్ డుమ్మా కొట్టారని.. ఈ ఏడాది కూడా కేసిఆర్ కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. సీఎం విమోచన దినోత్సవ వేడుకకు రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news