ఖమ్మంకు రెడ్ అలర్ట్.. మున్నేరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక !

-

ఖమ్మం జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా పరిధిలోని మున్నేరుకు భారీ వరద వస్తోంది. ఈ తరుణంలోనే మున్నేరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరింది. 16 అడుగులకు మున్నేరు నీటిమట్టం చేరింది. ఇక నిన్న రాత్రి నుంచి 8 అడుగులు వరద పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

Heavy flood in Munner The flood has reached the first danger warning level

అటు దాన వాయుగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్ , మోతీ నగర్‌ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత నెల 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చింది. ఆ వరద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరుకి వరద వచ్చింది. దింతో ఖమ్మం జిల్లా ప్రజలకు కస్టాలు తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news