సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. జల దిగ్బంధంలోనే రెవెన్యూ కాలనీ..!

-

తెలంగాణ గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వరద వచ్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పూర్తి స్థాయిలో నిండటంతో మూసీ నదికి వదిలారు. జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని రెండు రోజులుగా జల దిగ్బంధంలోనే రెవెన్యూ కాలనీ ఉంది. తాగునీటితో పాటు ఇతర అవసరాలకూ నీరు కరువు అయింది. ఇక నిత్యావసరాల కోసం పాట్లు పడుతున్నారు కాలనీవాసులు. రెవెన్యూ కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదు అధికారులు. కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నప్పటికి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇండ్లలోకి  పాములు, కీటకాలు వస్తున్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక దిగువన ఉన్న ఎర్ర కుంట తూములు మూసివేయడంతో కాలనీని ముంచెత్తింది వరద. ఎర్రకుంట మత్తడిపై అక్రమ నిర్మాణాలు చేయడంతో నీరు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news