తెలంగాణ, ఏపీకి మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.
కాగా, హైదరాదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకాపూర్, పంజాగుట్ట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బోయినపల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యాట్నీ, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రామంతాపూర్, షైక్‌పేట, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.