బిజెపి మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

బిజెపి మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యం పై మహా ధర్నా చేయాలని బిజెపి నిర్ణయించింది. ఈ క్రమంలో మహా ధర్నాకు పోలీసుల అనుమతి పై హైకోర్టులో బిజెపి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్నాకు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసింది.

ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా..? అని ప్రశ్నించింది న్యాయస్థానం. 5000 మందికి మీరు భద్రత కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించింది. అనంతరం మహా ధర్నాకు 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని.. ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని సూచించింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news