అర్హులందరికీ పింఛన్ ఇస్తాం – ఈటెల రాజేందర్

-

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకు పింఛన్ ఇస్తామని తెలిపారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 57 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.

రాష్ట్రంలో వాడ వాడలా బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయని విమర్శించారు ఈటెల రాజేందర్. ఇక రెండవసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ధనిక రాష్ట్రం అయితే ఇళ్లు ఎందుకు నిర్మించడం లేదని.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పాత్రికేయులకు ఇస్తానన్న ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే పేద రైతులకు మాత్రమే రైతుబంధు, రైతు బీమా ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news