కరోనా టెస్టులు పెంచాలని తెలంగాణ సర్కార్ కు హై కోర్టు ఆదేశాలు

-

కరోనా టెస్టులు పెంచాలని తెలంగాణ సర్కార్ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19 పై ఇవాళ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో విచారణ జరిగింది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కోవిడ్ టెస్టులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్న హై కోర్టు.. టెస్టులు పెంచాల్సిందేనని స్పష్టం చేసంది. కోవిడ్ మహామ్మారి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు అదేశించింది.

కోవిడ్ భారీన పడి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా పై నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఇక కరోనా మహమ్మారిపై తదుపరి విచారణను జూన్ 22 కు వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 100 కేసులకు పైగా నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news