హోళీ పండుగ : మందుబాబుల‌కు నిరాశ‌.. వైన్స్ బంద్

-

హోళీ పండుగ వ‌స్తుండటంతో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో పోలీసులు మందు బాబుల‌కు షాక్ ఇచ్చారు. హోళీ పండుగ వ‌స్తున్న నేప‌థ్యంలో మందు దుకాణాల‌పై నిషేధం విధించారు. రాచ‌కొండ ప‌రిధిలో రేపు సాయంత్రం 6 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు బంద్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మ‌ద్యం దుకాణాల‌తో పాటు బార్, ప‌బ్ ల‌ను కూడా మూసివేయాల‌ని రాచ‌కొండ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

కాగ హోళీ పండుగ రోజుల్లో హైద‌రాబాద్ లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. కాగ హోళీ పండుగ రోజు సాధార‌ణంగా మ‌ద్యం నిషేధం ఉంటే.. గొడ‌వ‌లు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. హోళీ పండుగ విషయంలో కూడా ప్ర‌జ‌ల‌కు, యువ‌తకు ప‌లు సూచ‌న‌లు చూశారు. హోళీ పండుగను జాగ్ర‌త్త‌గా జ‌రుపుకోవాలని సూచించారు. రోడ్ల మీద వెళ్తుతున్న వారిపై వాహ‌నాల‌పై రంగులు, నీళ్లు చ‌ల్ల‌రాద‌ని తెలిపారు. అంద‌రూ కూడా ప్ర‌శంతంగా పండుగ జ‌రుపుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు పోలీసులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news