తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరుతోంది. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. ఇన్నాళ్లూ నీరు లేక వెలవెలలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు జలకళతో సందడిగా మారాయి.
ఇక అటు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై నీరు నిలవడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఐటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తే మంచిదని పోస్టులు చేస్తున్నారు.