FLASH: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌పై అసత్య ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు పలు మీడియా ఛానెళ్లకు అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ లారీల నుంచి పొన్నం డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటీవల కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వాటిని సమర్థిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందని…ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది..అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు పేర్కొన్నారు.
ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి గారిపై ఆరోపణలు చేశారు…. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని ప్రతి లారికి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారన్నారు. అందుకే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.