రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు

-

హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మైట్రో రైల్‌ 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజు దాదాపు 4లక్షల 90వేల మంది ప్రయాణిస్తున్నారు. త్వరలో  ఈ సంఖ్య ఐదు లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అభిప్రాయ పడ్డారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని మెట్రోల్లో రోజూ సగటున 6.7లక్షలుగ మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 1.40లక్షల మంది ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు కాగా… విద్యార్థుల సంఖ్య 1.20 లక్షలుగా ఉంది.

హైదరాబాద్​లో ట్రాఫిక్​ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సేవలను ఇప్పుడు నగరం నలుమూలలకు విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఎల్​బీనగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం మార్గాల్లో మెట్రో సేవలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఎయిర్​పోర్టుకు ఎక్స్​ప్రెస్ మెట్రో రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా షురూ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news