జూన్‌లో 50% లోటు వర్షపాతం.. ఆశలన్నీ జులైపైనే

-

ఈ ఏడాది వర్షాకాలం రైతులను నిరాశకు గురి చేసింది. పంట పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు వానల కోసం జూన్ మాసమంతా ఎదురుచూశారు. పెట్టిన పెట్టుబడి వృథా అయింది కానీ వాన జాడ మాత్రం కానరాలేదు. జూన్​లో 131.4 మిల్లీమీటర్లకు గాను 65.2 మిల్లీమీటర్లే (-50 శాతం) వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అతి తక్కువగా కురిసింది. గత నెలలో 96 శాతం సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేయగా, ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితులు అనుకూలించలేదు.

జూన్‌ 12లోగా రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉండగా 21వతేదీకి గానీ రాలేదు. రుతుపవనాలు వచ్చినా.. జూన్ నెలలో అంతగా వర్షాలు కురవలేదు. ప్రస్తుతం అందరి ఆశలూ జులైపైనే ఉన్నాయి. ఈనెలలో సాధారణ వర్షపాతం 96 శాతం నమోదవ్వచ్చన్నది వాతావరణశాఖ అంచనా. రాష్ట్రంలో జూన్‌ వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే 17 జిల్లాల్లో 50 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో -77 శాతం లోటు నమోదయింది.

Read more RELATED
Recommended to you

Latest news