రేపు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎన్నికలు జరుగనున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 1100 కనెక్షన్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ప్రారంభమైందని.. గ్రేటర్ లో 11 లక్షల కనెక్షన్లు పెంచుకున్నామన్నారు. గ్రేటర్ లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా, గోదావరి నదీ జలాలను విరివిగా ఉపయోగించుకుంటున్నామని… కొండపోచమ్మ సాగర్ నీటిని కూడా ఉపయోగించు కుంటే మరో 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయిస్ గవర్నమెంట్ అని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీ కుండల ప్రదర్శన ఇప్పుడు లేదని.. కరోనా సమయంలో మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బంది పనులు అనిర్వచనీ యమన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బందికి 7500 ఇంసెంటివ్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని.. వాటర్ వర్క్స్ లో రిక్రూట్ మెంట్ జరుపుతామని ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఇంకా వాటర్ వర్క్స్ ను అభివృద్ధి చేస్తామని.. మెట్రో వాటర్ వర్క్స్ ఎన్నికల్లో రాంబాబు యాదవ్ ను గెలిపించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఎవరు పడితే వారు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.