BREAKING : తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, అటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలోనే.. ప్రజలు ఎవరూ కూడా.. బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, ఈ భారీ వర్షాల నేపథ్యంలో.. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేశారు. అటు ఇవాళ్టి నుంచి సోమవారం వరకు పాఠశాలలు, కాలేజీలు బంద్ కానున్నాయి. భారీ వర్షాల కారణంగా శనివారం వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న, ఇవాళ ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. రేపు శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.