వాహనదారులకు అలర్ట్‌..హైదరాబాద్‌ లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

-

వాహనదారులకు అలర్ట్‌..హైదరాబాద్‌ లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు యూసుఫ్‌గూడ 1వ TSSP బెటాలియన్ గ్రౌండ్ నందు తెలుగు సినిమా ” సర్కారు వారి పాట” ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా యూసుఫ్‌గూడ బెటాలియన్ పరిసర ప్రాంతాలలో వాహనాలు అధిక సంఖ్యలో తిరిగే అవకాశం వున్నది. ఇందువలన మధ్యాహ్నం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని అంచనా వేశారు పోలీసులు.

ఇట్టి పరిస్థితులలో అవసరాన్నిబట్టి ట్రాఫిక్ క్రింది ప్రదేశాలలో మళ్లించబడుతుంది:
1) మైత్రీవనం నుండి వచ్చే బస్సులు మరియు భారీ వాహనములు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించబడవు. సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కృష్ణకాంత్ పార్క్ – కళ్యాణ్ నగర్ వైపు మరియు సత్యసాయి నిగమాగమం – కమలాపురి కాలనీ – కృష్ణ నగర్ – జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ మళ్లించబడుతాయి.
2) జూబ్లీహిల్స్ నుండి వచ్చే బస్సులు మరియు భారీ వాహనములు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించబడవు. శ్రీ నగర్ కాలనీ వద్ద సత్యసాయి నిగమాగమం వైపు వాహనములు మళ్లించబడుతుంది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వ్యక్తులందరూ తప్పనిసరిగా నిర్వాహకులు జారీ చేసిన పాస్‌లను కలిగి ఉండాలి మరియు అలాంటి పాస్‌లలో హోలోగ్రాం (HOLOGRAM) మరియు సీరియల్ నంబర్ కలిగి ఉండాలి. పాస్‌లు లేని ఆహ్వానితులు బెటాలియన్ గ్రౌండ్లోకి అనుమతించరు.

 

Read more RELATED
Recommended to you

Latest news