రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా కు ఎలాంటి చట్ట బద్ధత లేదని మల్కాజ్ గిరి MP ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని,bప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా ఏర్పాటు పై ఏ క్యాబినెట్ మంత్రితో చర్చించినట్టు ఎక్కడ కనపడలేదు. హైడ్రాకు గొప్ప బాధ్యత ఉంటే.. శాసనసభలో చర్చించి చట్టబద్ధత కల్పించి ఏర్పాటు చేసి ఉండాల్సింది.
హైడ్రా ను రేవంత్ రెడ్డి తన సొంత ఎజండగా తీసుకొచ్చినట్టు ఉంది. అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. గత ప్రభుత్వాలు,గత ముఖ్యమంత్రులు,అనేక తప్పు చేసినట్టుగా,తాను మాత్రం అన్ని సరిదిద్దుతున్నట్టు ఫోజు రేవంత్ రెడ్డి కొడుతున్నారు. ఏవైతే అక్రమ నిర్మాణాలు అంటున్నావో, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల తప్పులను ముందుగా ఒప్పుకోని చెంపలేసుకుని సరిదిద్దాలి. అన్ని అనుమతులతో నిర్మాణం చేపట్టి,30 ఏళ్లుగా టాక్స్ కడుతున్న వాటిని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ముఖ్యమంత్రి కూల్చడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చి వాటిలో ప్రభుత్వా అనుమతులతో నిర్మించుకున్న వాటికి నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం చేయాలని చూడటం నీ అబ్బ జాగీర్ కాదు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.