పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తిచూపుతున్న తరుణంలో.. అక్కడి నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని ఖరాఖండీగా చెప్పేశారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని రేణుకా చౌదరి తెలిపారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని ఆమె చెప్పారు. సోనియా ఇక్కడికి వస్తే తమకు మహాభాగ్యమని అన్నారు. ఆమె నిర్ణయం చెప్పే వరకు ఎవరూ అభ్యర్థి కాదని తెలిపారు. సోనియాగాంధీకి తప్ప ఎవరికీ ఈ స్థానం ఇచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య ని ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం లోక్ సభ నుంచి బరిలోకి ఎవ్వరూ దిగనున్నారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.