మూసీ అద్భుతమైతే.. హరీశ్, కేటీఆర్, ఈటల అక్కడే ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా సచివాలయంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మూసీ పునరుజె్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరివాహక ప్రాంతంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ మూసీ నది ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాలీ చేయించిన ఇళ్లలో అయినా ఉండవచ్చన్నారు. ఆ సమయంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలు చెల్లించాలని కమిషనర్ దాన కిషోర్ ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
కేవలం స్వార్థం కోసం విష ప్రచారం చేస్తున్న ఈ నేతలు అక్కడ ఉండలేరన్నారు. వారు మూసీ నది ఒడ్డున ఉంటే.. 100 శాతం వారు చేసిన ఆరోపణలు కూడా తిరస్కరించను. ముగ్గురికి ఓపెన్ ఆపర్ ఇస్తున్న.. టెండర్ అగ్రిమెంట్ కు నష్టం జరిగితే నా సొంత ఆస్తి అమ్మి కడతాను. ప్రభుత్వానికి కూడా నష్టం రానివ్వను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.