డిండి ప్రాజెక్ట్ పూర్తయితే దేవరకొండ దరిద్రం పోతది : సీఎం కేసీఆర్

-

డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ద‌రిద్రం పోత‌ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌ల‌తో లింక్ ఉంట‌ది కాబ‌ట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వ‌స్తాయ‌ని సీఎం తెలిపారు. దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ నాయ‌క్ ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన బిడ్డ అని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీలో చేరినప్ప‌టి నుంచి డిండి ప్రాజెక్టు కోసం, ఇక్క‌డి వ్య‌వ‌సాయం, నీళ్ల గురించే మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీల నాయ‌కులే స్టేలు తీసుకురావ‌డంతో డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ఆగింది.

ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి. కేంద్ర ప్ర‌భుత్వం 10 ఏండ్ల స‌మ‌యం తీసుకుని, మొన్న నేను చెడామ‌డా తిట్టిన త‌ర్వాత ఈ మ‌ధ్య‌నే దాన్ని ట్రిబ్యున‌ల్‌కు రిఫ‌ర్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్త‌వుతుంది. పాల‌మూరు ఎత్తిపోత‌లకు లింక్ ఉంది కాబ‌ట్టి అది అయిపోయిందంటే.. ఐదు రిజ‌ర్వాయ‌ర్లు, ఒక బ్యార‌జ్ కూడా దేవ‌ర‌కొండ‌లో వ‌స్తుంది. మీ యొక్క ద‌రిద్రం పోతుంది అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాక ముందు ప‌రిస్థితి ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ సూచించారు. క‌రెంట్, మంచి నీళ్లు బాధ‌లు పోయిన‌య్, సాగునీటి బాధ‌లు తీర్చుకుంటున్నాం. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నాం. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఒక్క తండాను గ్రామ‌పంచాయ‌తీ చేయ‌లేదు. మా తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసుకున్నాం. 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news