గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ వచ్చినట్లే: రేవంత్ రెడ్డి

ఈడీ నోటీసులతో గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టేనని.. ప్రతి కార్యకర్త స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ సమగ్రత కోసం యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని, ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరిగినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.

దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అబద్దాల పునాదుల మీద అధికారం శాశ్వతంగా నిలబెట్టుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి. మూతపడిన కేసును మళ్లీ విచారణకు తేవడం బిజెపి కుట్రలో భాగమే అన్నారు.ఈడీ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి శాంతియుత నిరసన చేస్తామన్నారు.