గుడ్ న్యూస్ : ఉప‌కార వేత‌నాల‌కు కుటుంబ‌ వార్షికాదాయం పెంపు

-

తెలంగాణ ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఉప‌కార వేత‌నాల‌కు సంబంధించి కుటుంబ వార్షిక ఆదాయం పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ఉప‌కార వేత‌నాలకు కుటుంబ వార్షిక ఆదాయం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఓబీసీ, ఈబీసీ విద్యార్థుల‌కు కేంద్ర ఉప‌కార వేత‌నాల‌కు సంబంధించి ఆదాయ ప‌రిమితిని రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచింది. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 ల‌క్ష‌లకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఉపకార వేత‌నాలకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగూణం గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా కుటుంబ వార్షిక ఆదాయం పెంపున‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం తో విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే కుటుంబానికి స్వ‌ల్ప ఆదాయం ఉన్న విద్యార్థుల‌కు కూడా కేంద్ర ఉప‌కార వేత‌నాలు వ‌స్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news