ఉత్తర భారతదేశం చలికి గజగజ వణుకుతోంది. ముఖ్యంగా వాయువ్య రాష్ట్రాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ హెచ్చిరిస్తోంది. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలకు తగ్గితే.. చలిగాలులు ప్రారంభం అవుతాయని ఐఎండీ హెచ్చిరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సగటున 10 డిగ్రీల కన్నా దిగువగానే కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచానా వేసింది.
రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో చలిగాలుల నుండి తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం వరకు మరియు జమ్మూ, కాశ్మీర్-లడఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం మధ్యాహ్నం వరకు చలిగాలులు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు పొగ మంచు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ హెచ్చిరిస్తోంది.