గత 5 నెలల నుంచి అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత దొరికింది అని సంబరపడే లోపే మరో చిరుత వార్త వచ్చింది. బోనులో చిక్కుకున్న చిరుత ను మరో చిన్న బోను లోకి ఎక్కించారు అధికారులు. మరికాసేపట్లో చిరుత ను జూ పార్క్ కు తరలించనున్నామని అధికారులు పేర్కొన్నారు. 5నెలల క్రితం బద్వేల్ లో దొరికిన చిరుత అడుగుజాడలతో పాటు… గత కొద్ది రోజులుగా గగన్ పహడ్, హిమాయత్ సాగర్ వలంతరి లో ఉన్న చిరుత పదాల గుర్తులను పోల్చి చూస్తున్నారు.
ఆ జాడాలు సైజ్ తో పోల్చి చూసి ఆ తర్వాత మరో చిరుత లేదు అనుకుంటే మాత్రం ఆపరేషన్ ఆపేస్తారు. ఒకవేళ రెండు వేరు వేరు అని తెలిస్తే మాత్రం ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. పట్టుబడ్డ చిరుత ను జూ పార్క్ లో ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలేసే అవకాశం ఉంది.