అల‌ర్ట్ : ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు ఎల్లో అల‌ర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రం లో ఉష్ణోగ్ర‌త‌లు రోజు రోజు కు క‌నిష్టానికి ప‌డి పోతున్నాయి. రాత్రిళ్లు, తెల్ల వారు జామున తో పాటు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌తలు కూడా దారుణం గా ప‌డిపోతున్నాయి. ప్ర‌తి రోజు సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు 18 డిగ్రీలు ఉండాల్సింది. కానీ గ‌త రెండు రోజుల నుంచి 13 డిగ్రీలు మాత్ర‌మే న‌మోదు అవుతుంది. రాత్రి స‌మ‌యాల్లో కూడా ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రం గా ప‌డిపోతున్నాయి. దీంతో హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ నెల 19 వ‌ర‌కు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ప్ర‌జ‌లు రాత్రి స‌మ‌యాల్లో, తెల్ల‌వారుజ‌మున ఇల్ల‌లో నుంచి బ‌య‌ట రావ‌ద్ద‌ని సూచించింది.

అలాగే ఈ నెల 20, 21 తేదీ ల‌లో ఆరెంజ్ అల‌ర్ట్ ను కూడా జారీ చేసింది. వ‌చ్చే 5 రోజుల వ‌ర‌కు కూడా చ‌లి తీవ్ర‌త ఎక్కువ గానే ఉంటుంద‌ని తెలిపారు. ఈ కాలంలో ఉష్ణోగ్ర‌త‌లు 4 నుంచి 5 డిగ్రీల వ‌ర‌కు ప‌డిపోతాయ‌ని తెలిపారు. అలాగే చ‌ల్లిటి గాలులు కూడా గంట కు 6 నుంచి 8 కిలో మీట‌ర్ల వేగం తో వీస్తాయ‌ని పేర్కోన్నారు. ఉత్త‌ర తెలంగాణ లో 10 డిగ్రీల కన్న త‌క్కువ ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అవుతున్నాయని తెలిపారు. కుమురం భీం లో అత్య‌ల్పంగా 8 డిగ్రీలు న‌మోదు అయింద‌ని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ తో పాటు సిరిసిల్లా, జిగిత్యాల, మ‌హాబూబ బాద్ జిల్లాలో ఆరేంజ్ అల‌ర్ట్ ను జారీ చేసింది.