పార్టీ మారిన వాళ్ళను ఎక్కడ పడితే అక్క‌డే అడ్డుకోండి : రేవంత్

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మారిన వాళ్ళను..మంత్రులు అయినా వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి… అభివృద్ధికోసం అధికార‌ పార్టీ లోకి వెళ్ళిన వాళ్ళను నిల‌దీయండ‌ని పిలుపు నిచ్చారు రేవంత్‌. గోదావరి నీళ్ళు చేవెళ్లకు ఎందుకు రావడం లేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. 111 జీవో ఎత్తేస్తా అన్నాడు ఇప్పటికీ లేదని… పేదలు ఇండ్లు కట్టుకుంటే కుల్చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు.

revanth-reddy-cm-kcr

కానీ కేటీఆర్ ఫార్మ్ హౌస్ కట్టుకోవచ్చు .. దాని మీద ఈగ కూడా వాలనివ్వడం లేదని మండిప‌డ్డారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్త అన్న కెసిఆర్..ఫార్మ్ హౌస్ లో పెగ్గులు వేసి పడుకున్నాడని చుర‌క‌లు అంటించారు. త్వ‌ర‌లోనే పాదయాత్ర ఉంటుంది… ఇవాళ్టి పాద యాత్ర ఒక్కరోజే మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ చెప్పిందని ఒక్కరోజు పాదయాత్ర చేశామ‌న్నారు. టీఆర్ ఎస్‌ చెరువు తెగింది..అంద‌రూ కాంగ్రెస్ లోకే వ‌స్తారని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని… కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని స్ప‌ష్టం చేశారు రేవ‌త్ రెడ్డి.