మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాల్లో రూ.15 కోట్లు సీజ్

-

రెండున్నర రోజులపాటు ఉత్కంఠ సృష్టించిన మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, సంస్థల్లో బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు ముగిశాయి. ఈ సోదాల్లో పలుచోట్ల కీలకమైన దస్త్రాల స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డికి సంబంధించి రూ.15 కోట్లతో పాటు బంగారం కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 400 మంది అధికారులు, సిబ్బందితో… 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

దాదాపు మూడ్రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లా రెడ్డి వ్యాపార లావాదేవీలల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపాయి. మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో విద్యార్ధుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలను తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డికి చెందిన అన్ని రకాల కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూల్ చేసినట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news