BRS ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

-

గత మూడ్రోజులుగా హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీఆర్​ఎస్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లలో మూడ్రోజులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులపాటు తనిఖీలు జరిపిన అధికారులు ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి…. వారి వ్యాపార లావాదేవీలనూ పరిశీలించారు. వారి నుంచి కీలకపత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఐటీ దాడులపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందిస్తూ.. ” కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరించా. మొదటిరోజు గంటన్నరలోనే ఐటీ దాడులు పూర్తయ్యాయి. ఐటీ అధికారులు కావాలనే 3 రోజులు కాలయాపన చేశారు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. విదేశాలల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయన్నది అవాస్తవం. పాతికేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నా. ఐటీ అధికారులు నాకు నోటీసు ఇచ్చారు. విచారణ కోసం ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news