కేసీఆర్ వెళ్లే దారులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే: రాహుల్ గాంధీ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ వెళ్లే దారులను నిర్మించింది కేసీఆర్ పార్టీనే. కేసీఆర్ చదువుకున్న స్కూల్ ను కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. రైతులు, విద్యార్థుల నుంచి కేసీఆర్ దోచుకున్నవన్ని కక్కిస్తామన్నారు. కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ వద్ద జరుగుతున్న ఎన్నికల అని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని.. కాలేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని తెలిపారు.

అంతే కాదు ఎకరాలు కేసీఆర్ ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. బసవపత్రాల లీకేజీలో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదును విశ్వనారంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టూ భూములు ధరలు పలుకుతున్న అంటే కారణం కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బిజెపి బీహార్ ఎస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్న అన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందే విధంగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే ఆరు గారంటీలకు చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల 2500 అందిస్తామని 500 కే 100 గ్యాస్ సిలిండర్ రైతులకు కౌలు రైతులకు ఏటా ఎకరానికి 15000 రైతు కూలీలకు ఏటా 12000 అందిస్తామని తెలిపారు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తామని ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి ఐదు లక్షల ఆర్థిక అందిస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news